ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజాపోరు ప్రచార యాత్రకు సీపీఎం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నవంబర్ 8 నుంచి 15వ తేదీ వరకు ప్రచార యాత్రను నిర్వహిస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి రామారావు తెలిపారు. శుక్రవారం బ్రాడీపేటలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 15వ తేదీన మండల, జిల్లా కేంద్రాల వద్ద ధర్నా కూడా జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.