108 వాహన సిబ్బంది సమ్మె కారణంగా అత్యవసర పరిస్థితిలో వాహన సదుపాయం కావలసిన వారు 104కు ఫోన్ చేసి తక్షణ సహాయం పొందవచ్చని డీఎం హెచ్ ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి మంగళవారం తెలిపారు. డీఎంహెచ్ ఓ కార్యాలయం లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. ఇతర సహాయ, సలహాలు పొందటానికి సెల్ నెంబర్ 72075 95104ను సంప్రదించాలని సూచించారు.