వినాయక విగ్రహం తీసుకెళుతుండగా రోడ్డు ప్రమాదం
పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వినాయక విగ్రహం తీసుకెళుతున్న వాహనాన్ని ఎదురుగా వచ్చిన వాహనం ఢి కొట్టింది. ఈ ప్రమాదం లో వినాయక విగ్రహం వెంట ట్రాక్టర్ పై ఉన్న పదిమందికి గాయాలు అయ్యాయి. వీరిని వెంటనే మార్కాపురం జిల్లా వైద్య శాలకు తరలించారు.