రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మంగళవారం అమరావతిలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, అద్దంకి టిడిపి ఎమ్మెల్యే, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ లు కలిశారు. బడ్జెట్ లో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు భారీగా నిధులు కేటాయించటం పట్ల వారు చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. వెలిగొండకు 600 కోట్లు కేటాయించటం హర్షించదగినదని అన్నారు.