అద్దంకి పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు వ్యాపారస్తులు ఏర్పాటుచేసిన దీపావళి స్టాల్స్ ను బుధవారం ఎస్సై ఖాదర్ భాషా పరిశీలించారు. ప్రతి స్టాల్స్ దగ్గర నిర్వాహకులు ఇసుక, నీటిని అందుబాటులో ఉంచుకోవాలని ఆయన వారికి సూచించారు. నిబంధనలకు అనుగుణంగా పోలీస్ వారికి సహకరించాలని ఎస్సై ఖాదర్ భాషా తెలియజేశారు. ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని కోరారు.