విజయ డెయిరీ చైర్మన్ ఎస్పీ జగన్మోహన్ రెడ్డి, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మధ్య వివాదం ముదురుతోంది. విజయ డెయిరీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆమె.. ఆఫీస్లో సీఎం చంద్రబాబు చిత్రపటం లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో విజయ డెయిరీ చైర్మన్, అఖిలప్రియ మధ్య వాగ్వాదం జరిగింది. నచ్చినా నచ్చకపోయినా ప్రోటోకాల్ పాటించాలని, ప్రభుత్వానికి సంబంధం లేనట్లు ప్రవర్తిస్తున్నారని, పాత పద్ధతులు మానుకోండని అఖిలప్రియ హెచ్చరించారు.