AP: రాష్ట్రానికి వరద సాయం కింద కేంద్రం రూ.608.08 కోట్లను మంజూరు చేసింది. 2024లో విపత్తుల కారణంగా నష్టపోయిన ఐదు రాష్ట్రాలకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్(NDRF) కింద రూ.1554.99 కోట్ల అదనపు సహాయం అందించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అమిత్ షా నేతృత్వంలోని కమిటీ ఈ నిధుల మంజూరుకు ఆమోదం తెలిపింది. దీంతో ఏపీకి రూ.608.08కోట్లు మంజూరయ్యాయి.