మైనర్ బాలికను పెళ్లి చేసుకున్న యువకుడిపై గురువారం పోక్సో కేసు నమోదు చేసినట్లు పెద్ద మండ్యం సబ్ ఇన్స్పెక్టర్ పివి రమణ తెలిపారు. దామ్లా నాయక్ తండాకు చెందిన నాన్ కే నాయక్ (24) పదహారేళ్ల బాలికను ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడని తెలిపారు. తంబళ్లపల్లె మల్లయ్య కొండకు తీసుకెళ్లి 16వ తేదీన వివాహం చేసుకున్నారని కుటుంబీకులు తెలుసుకొని ఫిర్యాదు చేయగా పోక్సో కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.