మతిస్థిమితం లేని వ్యక్తిపై యువకులు దాడి చేసిన ఘటన శుక్రవారం కురబలకోట మండలంలో జరిగింది. రామిగాని పల్లికి చెందిన రామమూర్తి కి మతిస్థిమితం సరిగా లేదు. వీధిలో నిలబడి కనిపించిన వారిని దూషిస్తున్నాడని గ్రామంలోని కొందరు యువకులు ఊరి బయటకు లాక్కెళ్ళి విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచారు. బాధితుడిని కుటుంబీకులు మదనపల్లి ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు.