కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజా సమస్యలు త్వరగతిన పరిష్కరిస్తూ, ప్రజలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తోందని రైల్వే కోడూరు శాసనసభ్యులు ఆరవ శ్రీధర్, నియోజకవర్గ టిడిపి బాధ్యులు ముక్కా రూపానందరెడ్డి అన్నారు. శనివారం పుల్లంపేట, కోడూరు, చిట్వేలు మండలాల వారికి రూ. 2, 93, 799 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీ. ఎం. ఆర్. ఎఫ్) చెక్కులను పంపిణీ చేశారు.