ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో అక్రమ కట్టడాలను తొలగించాలని సోమవారం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ కు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్ వినతిపత్రం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న కట్టడాలు, మున్సిపల్ స్థలాలను ఆక్రమించి నిర్మిస్తున్న కట్టడాల వివరాలను కమిషనర్‌కు అందించామన్నారు.