పులివెందుల పట్టణంలోని రమణప్ప సత్రంబడి పాఠశాల ఎదురుగా ఉన్న కూల్ డ్రింక్ షాపులో చోరీ జరిగింది. దుండగులు కిటికీలను పగులగొట్టి వాటి ద్వారా షాపుకు ఉన్న లోపలికి ప్రవేశించి రూ. 6వేలతోపాటు సిగరెట్లను దోచుకుపోయారని బాధితురాలు తెలిపింది. శనివారం బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, ఎస్ఐ విష్ణు ఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.