పులివెందులలో ఈ నెల 22వ తేదీ నుంచి ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాముడు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ. 22న నగరిగుట్ట, వెంకటాపురం ప్రభుత్వ పాఠశాలల్లో, 23న అహోబిలాపురం ప్రాథమిక, రవణప్ప సత్రంబడి పాఠశాలల్లో, 24న కడప రోడ్డులోని గురుకుల పాఠశాల, వైఎస్ వీఆర్ఎం బాలికల జూనియర్ కళాశాలలో, 25న ఎస్బీఐ కాలనీలోని అంగన్వాడీ సెంటర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో ఆధార్ సెంటర్లు ఉంటాయన్నారు.