కుటుంబ సమస్యలతో ఒక వ్యక్తి విషం తాగి శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని సిఐ చాంద్ భాషా తెలిపారు. మదనపల్లి లోని దేవాలయం వీధిలో కాపురం ఉంటున్న మౌనీశ్వర రావు (68) కుటుంబ సమస్యల కారణంగా జీవితంపై విరక్తి చెందాడు. ఇంట్లో ఎవరూ లేరు సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడిని ఆసుపత్రికి తరలించి వైద్యుల సలహా మేరకు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.