నిమ్మనపల్లె మండలంలో స్కిల్ డెవలప్మెంట్ ఉన్న నిరుద్యోగుల గురించి సమగ్ర డేటా తో సర్వే చేపట్టాలని డిఎల్డిఓ లక్ష్మీపతి కోరారు. బుధవారం సచివాలయం ఉద్యోగులకు సమగ్ర సర్వేపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాంతీయ ఇండస్ట్రీలు నెలకొల్పడం కోసం నిరుద్యోగులు నైపుణ్యత పెంచుకోవాలని అన్నారు. నైపుణ్యంతో మినీ ఇండస్ట్రీలు ఏర్పాటు చేసుకొని తద్వారా ఆర్థిక వనరులు పెంచుకునేలా నిరుద్యోగులు కృషి చేయాలన్నారు.