కడప జిల్లా జమ్మలమడుగు పాత బస్టాండ్ లోని ఫిల్టర్ వాటర్ ప్లాంట్ను శుద్ధి చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి ఏసుదాసు సోమవారం అభ్యర్థించారు. ఆయన సిపిఎం నాయకులతో కలసి ప్లాంట్ను సందర్శించి, గతంలో శుద్ధి కోసం ఒక వ్యక్తిని నియమించినా, గత 2-3 సంవత్సరాలుగా ప్లాంట్ శుద్ధి జరగలేదని తెలిపారు. మున్సిపల్ అధికారులు వెంటనే శుద్ధి చేసి ప్రజల దాహార్తి తీర్చాలని కోరారు.