ఉరవకొండ: సీఐ చిన్నగౌస్ కు ఘన సన్మానం
మొదటిసారి వచ్చిన సీఐని కలుసు కొని నాయకులు, వివిధ సంఘాల నేతలు పుష్పగుచ్చాలు ఇవ్వడం, పూలమాలలు వేయడం, శాలువలు కప్పి సన్మానించడం ఆనవాయితీ. అయితే, ఉరవకొండ సర్కిల్ కు రెండవసారి బాధ్యతలు స్వీకరించిన సీఐ చిన్న గౌస్ కు గురువారం ఘనసత్కారాలు కొనసాగుతుండడం విశేషం. ఆయనను అభిమానంగా సన్మానించి కుల, మతాలకు అతీతంగా, అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య భేదభావాలు చూపకుండా ప్రజలు గొప్పగా సత్కరించారు.