ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా బుధవారం కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. స్థానిక ఇందిరానగర్ లో మురికి కాలువలు పొంగిపొర్లాయి. దీంతో ఇంటి బయట నిలిపిన ద్విచక్రవాహనాలు సగం వరకు మునిగిపోయాయి. బుధగవి చెరువు మరువ పారుతుంది. నియోజకవర్గం వ్యాప్తంగా 62. 8 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.