కూడేరు మండల కేంద్రంలోని విజ్ఞేశ్వర కాలనీ యందు ఆదివారం సిపిఐ నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికలు ముందు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు.. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని వారు డిమాండ్ చేసారు.