వజ్రకరూరు మండల కేంద్రంలో సీపీఎం మండల మహాసభ నిర్వహించారు. ఈ సభకు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బాలరంగయ్య హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ. హంద్రీనీవా కాలువ కింద రాగులపాడు లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి మండలంలోని పిల్ల కాలువలు ఏర్పాటు చేసి సాగు తాగునీరు ఇవ్వాలని శుక్రవారం డిమాండ్ చేశారు. కాలువల ద్వారా నీటి సరఫరా చేస్తే కరవును అధిగమించి రైతులను ఆదుకోవచ్చని తెలిపారు.