ఉరవకొండలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయంలో కార్తీకమాసం 3వ సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారి మూల విరాట్ కు పంచామృతాభిషేకాలు, అర్చనలు చేశారు. వివిధ రకాల పుష్పాలతో చంద్రమౌలేశ్వరుడిని అందంగా అలంకరించారు. పట్టణం నుంచే కాకుండా వివిధ గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.