ఆడపిల్లలకు చిన్న వయస్సులోనే పెళ్లిళ్లు చేయడంతో వచ్చే అనర్దాలపై ఉరవకొండ మండలం పెద్ద కౌకుంట్ల గ్రామ ఆరోగ్య విద్యా బోధకులు వెంకటరమణ విద్యార్థులకు అవగాహన కల్పించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు గర్భస్థ లింగ నిర్ధారణ నిరోధక చట్టం, బేటి బచావో, బేటి పఢావో, టీనేజ్ ప్రెగ్నెన్సీ వల్ల కలిగే నష్టాలు పట్ల అవగాహన నిర్వహించారు. తల్లిదండ్రులకు విద్యార్థులే అవగాహన చేయాలని సూచించారు.