కూడేరు మండలం ఇప్పేరు గ్రామంలో సాగులో ఉన్న కంది పంటను శుక్రవారం వ్యవసాయ పరిశోధనా స్థానం రేకులకుంట శాస్త్ర వేత్తలు డాక్టర్ నారాయణస్వామి, డాక్టర్ నటరాజ్ పరిశీలించారు. శాస్త్రవేత్తల పరిశీలనలో మారుకా మచ్చల పురుగు, పచ్చపురుగు ఉదృతిని గమనించారు. రైతులకు సస్యరక్షణ సంబంధించిన సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో ఏఓ విజయకుమార్, రైతు సేవా కేంద్రం ఎంపీఈవో శ్రీలత, కంది పంట సాగు చేసిన గ్రామ రైతులు పాల్గొన్నారు.