మానసిక స్థితి సరిగా లేని ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. విడపనకల్లు మండలం డోనేకల్ గ్రామానికి చెందిన భజనగారి ఉమేష్ అనే వ్యక్తి శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలంగా మానసిక స్థితి సరిగా లేకపోవడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.