ఉరవకొండ మండలంలో వరుస చోరీలతో ప్రజలు, గ్రామీణులు బేంబేలు చెందుతున్నారు. పట్టణంలో శుక్రవారం ఓ కిరాణా షాపులో నాలుగు లక్షలు చోరీ అయ్యింది. ఇది ఇలా ఉంటే శనివారం మండలంలోని బూదగవి గ్రామంలో కురుబ ధనుంజయ ఇంటిలో చోరీ అయ్యింది. రూ 2 లక్షల నగదు, ఎనిమిది తులాలు బంగారు చోరీకి గురైంది. కాగా అధికారులు స్పందించి చోరీకి గురైన వస్తువులను రికవరీ చేయాలని, దొంగలను శిక్షించాలని కోరుతున్నారు.