పెద్దవడుగూరు మండలంలోని పలుగ్రామాల్లో ఉంటున్న దాబాల్లో మద్యం విక్రయాలు, మద్యం తాగించడం వంటివి చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్సై ఆంజనేయులు హెచ్చరించారు. స్థానిక పోలీసుస్టేషన్ ఆవరణలో ఆదివారం దాబా యజమానులతో ఆయన ప్రత్యేకంగా చర్చించారు. ప్రస్తుతం మిడుతూరు, కాశే పల్లి, గుత్తి అనంతపురం, అప్పేచెర్ల, క్రిష్టిపాడు, పెద్దవడుగూరు గ్రామాల్లోని దాబాలో మద్యం విక్రయాలు చేయరాదని కౌన్సెలింగ్ ఇచ్చారు.