శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పుట్లూరు సీఐ సుబ్రహ్మణ్యం హెచ్చరించారు. శుక్రవారం యల్లనూరు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గొడవలు సృష్టించినా, పాల్పడినా జైలుకు పంపుతానన్నారు. ఎక్కడైనా శాంతిభద్రతలు అదుపుతప్పితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదన్నారు.