సింగనమల మండల పరిధిలోని కొత్తపల్లి వద్దనున్న సప్తగిరి క్యాంపర్ పరిశ్రమలో ప్రమాదం జరిగి అస్వస్థత గురైన కార్మికులు అనంతపురం నగరంలోని కిమ్స్ సవేరా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, శనివారం చికిత్స పొందుతున్న బాధిత కార్మికులను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పరామర్శించారు. అనంతరం బాధిత కార్మికుల కుటుంబ సభ్యులతో మాట్లాడి కార్మికులకు నాణ్యమైన చికిత్స అందిస్తామని భరోసా కల్పించారు.