రాయదుర్గం మున్సిపాలిటీలో గత కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికులు డిమాండ్ చేశారు. సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో రాయదుర్గం పాత మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి అర్థనగ్న ప్రదర్శనతో కొత్త మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు.