గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రామసభలను ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే పరిటాల సునీత సోమవారం తెలిపారు. రాప్తాడు నియోజకవర్గం పరిధిలోని కనగానపల్లి, రామగిరి, చెన్నేకొత్తపల్లి మండలాలలోని అన్ని రెవెన్యూ గ్రామాలలో ఈ గ్రామ సభలు జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో, తహశీల్దార్, ఇతర మండల అధికారులంతా హాజరవుతారని తెలిపారు.