అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం శ్రీశైలం డ్యాం నుంచి హంద్రీనీవా నీటిని బుక్కపట్నం చెరువు కు తీసుకు వచ్చిన సందర్భంగా ఏర్పాటుచేసిన పైలాన్‌ను వైసిపి నాయకులు ఓర్వలేకే ధ్వంసం చేశారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక పార్టీ కార్యాలయాలు దేవాలయాలు మసీదులు చర్చిలు పై దాడులు పెరిగిపోయాయి అన్నారు. కుంటి సాకులు చెప్పి రేషన్ కార్డుల తొలగింపు, పింఛన్ల తొలగింపు చేయడం తగదన్నారు. ఇలానే వ్యవహరిస్తూ పోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.