రేపు వాల్మీకి జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశాల మేరకు జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పుట్టపర్తి పట్టణంలోని సాయి ఆరామం నందు ఉదయం 10 గంటలకు జిల్లా స్థాయిలోవాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, హిందూపురం పార్లమెంటు సభ్యులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ రాజకీయ పార్టీకి చెందిన నాయకులు, తదితరులు పాల్గొంటారని బుధవారం తెలిపారు.