దీపావళి పండుగ సంబరాలు చేసుకోవడానికి పిల్లలు అడుగుతున్నారని బాణాసంచ దుకాణానికి వెళితే అక్కడ ధరలు చూసి ప్రజల గుండె గుభేల్ మంటోంది. వెయ్యి రూపాయలు లెక్కే కాదు కనీసం టపాసులు కొనాలంటే రూ. 5, 6 వేలు వెచ్చించాల్సి వస్తోంది. ఇప్పటికే పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు నిత్యావసరాల ధరలతో అల్లాడిపోతున్న జనం టపాసులు కొనుగోలు చేయాలంటే భయపడిపోతున్నారు.
రెండు రోజుల వ్యాపారమైనా లక్షల్లో జరుగుతోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది అనుమతులు ఇవ్వడం వరకే ఆ తర్వాత మీ ఇష్టం అన్న చందంగా అధికారులు వ్యవహరిస్తుండడంతో బాణసంచా దుకాణం ఇస్తా సిండికేట్ గా వ్యాపారం చేస్తున్నారు. మీకు ఇష్టముంటే కొనండి లేకపోతే లేదు అని తెగేసి చెబుతున్నారు. దీంతో వినియోగదారులకు ఏంచేయాలో దిక్కుతోచడం లేదు. ఏ షాప్ కి వెళ్ళినా ఇదే పరిస్థితి ఉండడంతో తప్పని పరిస్థితుల్లో అప్పు చేసి మరీ పిల్లల్ని సంతోష పెట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనుమతులు ఇచ్చామా నిబంధనలకు అనుగుణంగా విక్రయాలు జరుగుతున్నాయా అంతవరకే, ధరల నియంత్రణ మాకు సంబంధం లేదన్న రీతిలో అధికారులు వ్యవహరిస్తుండడంతో బాణసంచా విక్రయదారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. అనుమతులు రావడమే తరువాయి సరుకు తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయాలు చేస్తున్నారు.
ఏ ఒకరో ఇద్దరో అధికారులు ప్రశ్నించకుండా వారికి టపాసులు పొట్లం చేతిలో పెట్టి పంపిస్తున్నారు. ఈ ధరల ఉచితంగా టపాసులు పట్ల దొరికితే ఆదేశాలు అన్నట్లు కొందరు అధికారులు కూడా చూడనట్లు వివరిస్తూ సంతోష పడిపోతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు సిండికే ట్ గా మారి జంబో ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్, థౌజండ్ వాలా ప్యాక్ అంటూ వేలాది రూపాయలు దండుకుంటున్నారు.
కరోనా కష్టకాలం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న చిరువ్యాపారులు చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తున్నవారు వేలాది రూపాయలు పెట్టి పిల్లలకు బాణసంచా కొని ఇవ్వలేక ఉన్న కాడికి సర్దుకుపోతున్నారు. కొందరైతే నెలవారి ఇంటి అవసరాలకు అయ్యే అంత ఖర్చు టపాసులు ఎలా పెట్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు తప్పని పరిస్థితుల్లో అప్పు చేసి మరీ పిల్లల్ని సంతోషపడుతున్నారు.
ధరల నియంత్రణ పాటించి ఉంటే కనీసం పండుగ అయినా సంతోషంగా జరుపుకునే వాళ్ళం, పిల్లలకు బట్టలు టపాసులు పండుగ సరుకులు కొనాలంటే అప్పు చేయక తప్పడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా గతంతో పోలిస్తే ఈసారి బాణసంచా మోత మోగిన పండగ కళ తప్పినట్లే కనిపిస్తోంది.