పుట్టపర్తి పరిధిలోని బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గర ఫైబర్ నెట్ లో పనిచేసే యువకుడు ఆఫీస్ పక్కన ఉన్న కరెంటు స్తంభం వద్ద తన బైక్ తియ్యడానికి వెళ్ళగా బుధవారం కరెంట్ షాక్ కు గురయ్యాడు. అది గమనించిన స్థానికులు వెంటనే అతడిని కర్రతో కొట్టి ప్రాణాపాయం నుండి రక్షించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సింధూర బాధితుడితో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విద్యుత్ అధికారులకి ఫోన్ చేసి వారిని మందలించారు.