రైతుకు అండగా నిలుస్తున్న రైతు భరోసా కేంద్రాలు

880பார்த்தது
రైతుకు అండగా నిలుస్తున్న రైతు భరోసా కేంద్రాలు
రైతుల సంక్షేమం కోసమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారని వైసిపి నాయకులు పేర్కొన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో బుక్కపట్నం అగ్రి బోర్డ్ చైర్మన్ ఆవుటాల రమణారెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పెట్టిన ప్రతి పంటకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి పంటల బీమా అమలు చేస్తోందన్నారు. అయితే ఏ పంట పెట్టినా రైతులు తప్పనిసరిగా ఈ క్రాప్ బుకింగ్ నమోదు చేయించుకోవాలన్నారు. డ్రిప్, స్పింకర్లు పరికరాలు 90 శాతం సబ్సిడీతో పార్టీలకతీతంగా రైతులకు భరోసా కేంద్రాల ద్వారా అందించడం జరుగుతుందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, మందులు, విత్తనాలు రైతుల ముంగిట సరఫరా చేయడం జరుగుతుందన్నారు.

రైతులు ఈ కేంద్రాల ద్వారా లబ్ది పొందాలని కోరారు. ప్రతి నియోజకవర్గంలోనూ వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ అగ్రి ల్యాబ్ ను కొత్తచెరువు లో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ కన్వీనర్లు జగన్మోహన్ రెడ్డి, గంగాద్రి, సుధాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ శ్యాంసుందర్ రెడ్డి పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி