సోమందేపల్లి మేజర్ పంచాయతీలోని సాయి నగర్లో వైసీపీ కార్యకర్త చాకలి వెంకటేష్ అనారోగ్యంతో మృతి చెందారు. మంగళవారం ఈ విషయాన్ని తెలుసుకున్న సోమందేపల్లి మండల వైసీపీ నేత రమాకాంత్ రెడ్డి, వెంకటేష్ ఇంటికి వెళ్లి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.