సోమందేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ చౌడేశ్వరి (నక్కలగుట్ట) కాలనీ వద్ద బస్సు షెల్టర్ ఏర్పాటు చేయాలని సోమందేపల్లి తహశీల్దార్‌కు మంగళవారం కాలనీ వాసులు వినతి పత్రం అందజేశారు. చౌడేశ్వరి కాలనీలో 500 కుటుంబాలకు పైగా నివసిస్తున్నందున, బస్సు షెల్టర్ లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వారు తెలిపారు.