త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. ఆదివారం రొద్దం మండల కేంద్రంలో మంత్రి సవిత పర్యటించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రూ. 25 కోట్లకుపైగా నిధులతో నియోజక వర్గ వ్యాప్తంగా గ్రామాల్లో సీసీ రోడ్డు, డ్రైనేజీలు నిర్మిస్తున్నామన్నారు. రొద్దం మండలంలో ఎంజేపీ స్కూల్ ను రూ. 22. 50కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.