గ్రామ రెవెన్యూ సహాయకులకు కనీస వేతనం రూ. 15 వేలు ఇవ్వాలని సోమవారం పెనుకొండ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ హనుమంతుకి సీఐటీయూ నాయకులు వితపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ.. నామినీలను విఆర్ఎలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ బాబావలి, వీఆర్ఏల సంఘం నాయకులు అంజనప్ప, చెన్నకేశవులు, గోవిందప్ప, సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు.