చేనేతకు చంద్రబాబు పాలన ఎప్పుడూ స్వర్ణయుగమే అని రాష్ట్ర మంత్రి సవిత పేర్కొన్నారు. మంగళవారం శాసనసభలో బడ్జెట్ సమావేశాల సందర్బంగా ఏడో రోజు పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సవిత సమాధానాలు ఇచ్చారు. గత 5 ఏళ్లగా చేనేత రంగంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఈ బాధలు తాళలేక నేతన్నలు కొన్ని చోట్ల ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు.