విజయనగర (హంపి) సామ్రాజ్యాన్ని పాలించిన రెండో రాజవంశం- 'సాళువ' పాలకులు చాళుక్య వంశ వారసులనే సరికొత్త చారిత్రక అంశాన్ని చరిత్ర కారుడు మైనాస్వామి ప్రకటించారు. గురువారం గోరంట్ల మాధవ రాయల గుడి ముందుగల రాతి పలక శాసనం ఆవిషయాన్ని వెల్లడిస్తున్నదని విలేఖరుల సమావేశంలో ఆయన చెప్పారు. గోరంట్ల మాధవరాయ స్వామి "అంగరంగ వైభోగ” సేవలకు భూదానం ఇస్తూ. శాసనాన్ని సాళువ నరసింగ రాయలు రాయించాడని తెలిపారు.