మడకశిర పట్టణంలో సిపిఐ తాలూకా సెక్రెటరీ పవిత్ర ఆధ్వర్యంలో సోమవారం వైఎస్ఆర్ సర్కిల్ నుండి తాహాశీల్దార్ కార్యాలయంవరకు ర్యాలీ చేపట్టారు. ఇంటి స్థలాలు ఇవ్వాలని నినాదాలు చేస్తూ తాహాశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా డిప్యూటీ తాహసిల్దార్ లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ తాలూకా సెక్రెటరీ పవిత్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రి పేదలకు ఇచ్చిన హామీ మేరకు పట్టాలు మంజూరు చేయాలన్నారు.