మహిళలకు రక్షణ కల్పించలేని దిశా చట్టాన్ని గత వైసీపీ ప్రభుత్వంలో ఎందుకు ప్రవేశపెట్టారంటూ మడకశిర ఎమ్మెల్యే ఎం. ఎస్. రాజు ప్రశ్నించారు. అనంతపురం ఆర్ అండ్ బి అతిథి గృహంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. జగన్ నివాసానికి సమీపంలో ఉన్న సీతారామపురంలో భర్త ముందు భార్యను హత్యాచారం చేస్తే ఐదేళ్లలో చర్యలు చేపట్టలేదని తెలిపారు. ఒకట్రెండు రేపులకే రాద్ధాంతమా అన్న రోజాకు మహిళల గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు.