ఫేక్ ఫోన్ కాల్స్ తో వేధింపులకు గురికావద్దని, వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కన్జ్యూమర్స్ ప్రొటక్షన్ సెల్ సభ్యుడు కిషోర్ కుమార్ హెచ్చరించారు. శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో ఫేక్ ఫోన్ కాల్స్ ద్వారా అమ్మాయిల తల్లిదండ్రులను టార్గెట్ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. అలాంటి ఫేక్ కాల్స్ ను నమ్మవద్దని తెలిపారు. ఫేక్ కాల్స్ పై అనుమానం వస్తే పోలీసులను ఆశ్రయించాలన్నారు.