కళ్యాణదుర్గం పట్టణంలోని అర్బన్ పోలీస్ స్టేషన్ లో శనివారం డాబా నిర్వాహకులతో డీఎస్పీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రవిబాబు సీఐ వెంకటరమణతో కలిసి డాబా నిర్వాహకులతో మాట్లాడుతూ డాబాల్లో మద్యపానం నిషేధమని చెప్పారు. మద్యం తాగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవన్నారు.