కళ్యాణదుర్గం శ్రీ విరక్తి గౌరీ మఠం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ఇంటర్నేషనల్ అకౌంటింగ్ డేను బుధవారం ప్రిన్సిపల్ జయరామ్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి జనార్దన్ రెడ్డి కామర్స్ ఉపన్యాసకులు రాధాకృష్ణ మాట్లాడుతూ నేడు వాణిజ్య వ్యాపార రంగాలలో ఇ-కామర్స్, అకౌంటింగ్ ప్రాధాన్యత సంతరించుకున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కామర్స్ విద్యార్థులు పాల్గొన్నారు.