కదిరి లో 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ
కదిరి పట్టణ కేంద్రంలోని న్యాయస్థానం ఆవరణంలో సెప్టెంబర్-14న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించనున్నామని సీనియర్ సివిల్ జడ్జి జయలక్ష్మి ఓ ప్రకటనలో శనివారం తెలిపారు. న్యాయ సేవాధికార సంస్థ సూచనల మేరకు. కక్షిదారులు రాజీ పద్దతిలో కేసులు పరిష్కరించనున్నారు. కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా గల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, రాజీ పద్దతిలో కేసులు పరిష్కరించుకోవాలని కోరారు.