నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నగర వనాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ. 15. 4 కోట్ల నిధులు విడుదల చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. అందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని శ్రీకృష్ణదేవరాయ ఎకోపార్క్, కదిరిలోని బత్రేపల్లి వాటర్ ఫాల్స్ ఎకోపార్క్ ను అభివృద్ధి చేయనున్నారు. రాష్ట్రంలో పచ్చదనం సుమారు 50 శాతం ఉండాలని, నగర వనాలపై దృష్టి సారించాలని అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు.