కదిరి మున్సిపాలిటీ పరిధిలోని సింహకోట పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన ఇద్దరు వ్యక్తులపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. కదిరి మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు మన్యం రెడ్డప్ప, గూడూరు హరినాథ్ అనే ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టు కదిరి పట్టణ పోలీసులు పేర్కొన్నారు. సర్వే నెంబర్ 536లో గదులు నిర్మించుకోగా మున్సిపల్ కమిషనర్ వాటిని తొలగించే ప్రయత్నం చేశారు. దౌర్జన్యానికి దిగడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.