అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో అక్రమంగా తరలిస్తున్న 700 ప్యాకెట్లు రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై హేమంత్ కుమార్ తెలిపారు. డీఎస్పీ భవ్య కిశోర్, సీఐ శ్రీనివాసులు, ఆదేశాల మేరకు కదిరి - మదనపల్లి హైవేల మీద తనిఖీలు చేస్తుండగా మైదుకూరు నుంచి కర్నాటక తరలిస్తున్న బియ్యం లారీని పట్టుకున్నామన్నారు. 700 ప్యాకెట్లు 50కేజీలు బరువు కలిగినవి సీజ్ చేశామన్నారు. ఈ దాడులో పాల్గొన్న ఎస్ఐ హేమంత్ కుమార్, ఏఎస్ఐ, నరసింహులు, పోలీస్ సిబ్బందికి డీఎస్పీ, సీఐ అభినందించారు.